WPL.. ఢిల్లీపై గుజరాత్ విజయం

by Muthe.Rajitha |

WPL 2026లో నేడు ఢిల్లీపై గుజరాత్ ఉత్కంఠ విజయం సాధించింది.

WPL.. ఢిల్లీపై గుజరాత్ విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : WPL 2026లో నేడు ఢిల్లీపై గుజరాత్ ఉత్కంఠ విజయం సాధించింది. వడోదరలోని కోటాంబి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా.. గుజరాత్ బ్యాటింగుకు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బెత్ మూనీ 46 బంతుల్లో 58 పరుగులతో అర్ధశతకం సాధించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, అనుష్క శర్మ 39 పరుగులు చేసి రాణించింది. ఒక దశలో గుజరాత్ స్కోర్‌ 139/7కి పడిపోయినా, చివరి ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టారు.

ఢిల్లీ బౌలర్లలో శ్రీ చరణి 4 వికెట్లు, చినెల్ హెన్రీ 2 వికెట్లు తీశారు. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ చివరి వరకూ గట్టిగా పోరాడి 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులకే పరిమితమైంది. నికి ప్రసాద్ 47 పరుగులు చేసి మ్యాచ్‌ను చివరి వరకు తీసుకొచ్చింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమైన సమయంలో సోఫీ డివైన్ అద్భుత బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్‌కు విజయాన్ని అందించింది.

సోఫీ డివైన్ 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి కీలక వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పింది. ఈ ఉత్కంఠభరిత గెలుపుతో గుజరాత్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరుకుంది.

Next Story