- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.5వేల కోట్ల అన్లైన్ గేమింగ్ నెట్ వర్క్ చేధించిన జీఎస్టీ ఇంటిలిజెన్స్
దేశవ్యాప్తంగా విస్తరించిన సుమారు రూ.5 వేల కోట్ల విలువైన ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హైదరాబాద్ అధికారులు ఛేదించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా విస్తరించిన సుమారు రూ.5 వేల కోట్ల విలువైన ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హైదరాబాద్ అధికారులు ఛేదించారు. అన్ లైన్ గేమింగ్ రాకెట్ పై దాడులు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలు, హవాలా మార్గాల ద్వారా డబ్బు మార్పిడి వంటి ఆరోపణలపై విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. కీలక ఆధారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాంక్ లావాదేవీల వివరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరూ ముంబైకి చెందిన వైఎస్ ప్రభు కుమార్, హైదరాబాద్‌కు చెందిన రాజ శేఖర్ రెడ్డిగా గుర్తించారు. వీగోఫిన్ డిజిటల్ సోల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్‌గా ప్రభు కుమార్ వ్యవహరిస్తున్నారని గుర్తించారు.
ఈ రాకెట్‌కు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి రాజ శేఖర్ మాస్టర్‌మైండ్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు పేర్కోన్నారు. విదేశీ సర్వర్లు, షెల్ కంపెనీలు, ఫేక్ అకౌంట్ల ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ గేమింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్టు ప్రాథమికం విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. జీఎస్టీ చట్టాల ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ కోణంలో కూడా కేసును పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి కీలక వ్యక్తులపై నిఘా కొనసాగుతోందని పేర్కోన్నారు. అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు.
- Tags
- GST Intelligence






