- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంత్యక్రియల్లో లేచి కూర్చున్న బామ్మ.. షాకైన జనం
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ్‌పూర్ పట్టణానికి చెందిన 103 ఏళ్ల గంగాబాయి సఖారే కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి ఎంతకీ కదలక పోవడంతో కుటుంబ సభ్యులు ఆమె మరణించినట్లు భావించారు. విషయం తెలిసి వివిధ ప్రాంతాల్లో ఉన్న బంధువులంతా చివరి చూపు కోసం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో విషాద వాతావరణం నెలకొని, అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. అయితే అకస్మాత్తుగా ఆమె పాదాల వేళ్ళు కదులుతుండటంతో వెంటనే ఆమె ముక్కులో పెట్టిన దూదిని బయటికి లాగారు. దీంతో గంగాబాయి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుంటూ లేచి కూర్చుంది.
స్థానిక వైద్యుణ్ణి పిలిపించి పరీక్షించగా.. ఆమె ఆరోగ్యంగా ఉందని, కాస్త నీరసంగా ఉన్నట్టు తేల్చారు. అయితే చనిపోయిందనుకొని భావించి అంతా శోకసంద్రంలో మునిగిపోగా.. ఇలా సడన్ గా బామ్మ లేచి కూర్చోవడంతో ఈసారి అంతా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈరోజే బామ్మ 103వ పుట్టినరోజు కావడంతో బర్త్ డే కేక్ కట్ చేయగా.. అంత్యక్రియలకు వచ్చినవాళ్లు సంతోషంగా కేక్ తిని వెళ్లిపోయారు. కాగా.. ఈ వ్యవహారం సోషల్ మీడియాకు చేరడంతో బామ్మ పునర్జన్మ వైరల్ గా మారింది.






