గవర్నర్ నిర్ణయం శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్

by Malleboina Mahesh |

అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా ఆమోదించిన గవర్నర్ నిర్ణయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. వీరి అనుభవం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

గవర్నర్ నిర్ణయం శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజానికి సేవ చేసిన వ్యక్తులకు శాసన మండలిలో స్థానం కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థ బలాన్ని ప్రతిబింబిస్తుందని, ప్రజా జీవితం, క్రీడా రంగం, సామాజిక ఉద్యమాల్లో విశిష్ట సేవలు అందించిన అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ అవకాశం రావడం సముచిత నిర్ణయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొ. కోదండరాం పోషించిన పాత్ర చారిత్రాత్మకమని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఉద్యమ దశలో ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్లిన నాయకుల్లో కోదండరాం ఒకరని అన్నారు. అలాంటి వ్యక్తికి శాసన మండలిలో అవకాశం కల్పించడం రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయమన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రానికి ఉద్యమ అనుభవం, సామాజిక అవగాహన, ప్రజా సమస్యలపై స్పష్టత ఉన్న నాయకుల అవసరం ఎంతో ఉందని, అజారుద్దీన్, కోదండరామ్‌లకు ఎమ్మెల్సీ పదవులు రావడం ద్వారా శాసన మండలి చర్చలు మరింత ప్రజా ప్రయోజనకరంగా ఉంటాయని, రాష్ట్ర అభివృద్ధికి వారి అనుభవం ఉపయోగపడుతుందని మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story