- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల ధాన్యం కొనుగోలులో జాప్యం చేయొద్దు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలులో ఎలాంటి జాప్యం చేయొద్దని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు.

దిశ,రామన్నపేట: రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలులో ఎలాంటి జాప్యం చేయొద్దని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అమ్మిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి, ఎలాంటి జాప్యం లేకుండా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కావాల్సిన లారీలు, హమాలీల అందుబాటు, ధాన్యం నిల్వ, తరలింపు ప్రక్రియ, కొనుగోలు కేంద్రాల్లో ఏర్పడుతున్న సమస్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.






