- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అథ్లెట్ జ్యోతి యర్రాజీకి ప్రభుత్వం గుడ్ న్యూస్
అథ్లెట్ జ్యోతి యర్రాజీకి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : అథ్లెట్ జ్యోతి యర్రాజీకి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2025లో జరిగిన ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి స్వర్ణ పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తిస్తూ గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగాన్ని, విశాఖపట్నంలో 500 గజాల ఇంటి స్థలాన్ని బహుమతిగా ప్రకటించింది. ప్రభుత్వం అందించిన బహుమతిపై జ్యోతి సంతోషం వ్యక్తం చేసింది. తనకు ఈ స్థాయిలో ప్రోత్సాహం అందించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. "నాకు ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రోత్సాహం వల్లే నేను ఈ విజయం సాధించగలిగాను. ఇకపై కూడా దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా మరిన్ని పతకాలు తెచ్చేందుకు కష్టపడతాను" అని జ్యోతి యర్రాజీ భావోద్వేగ వీడియోను విడుదల చేసింది.






