తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీలు.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

by Malleboina Mahesh |   (  Updated:2026-04-26 15:02:28  IST  )

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్ నియామకం. ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది.

తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీలు.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ (Governor's quota MLC) స్థానాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు తెలంగాణ జన సమితి (TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత కొంతకాలంగా ఈ పేర్లపై ఉన్న సస్పెన్స్‌కు తెరదించుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆదివారం జీవో (GO) విడుదల చేసిన ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ (Governor's quota MLC) స్థానాలను ప్రభుత్వం భర్తీ చేస్తూ జీవోను విడుదల చేసింది. గతంలో రాజకీయ కారణాల వల్ల ఈ ఎమ్మెల్సీల నియామకంపై న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పటికీ, ప్రస్తుత నియామకాలతో ప్రభుత్వం ఆ స్థానాలను అధికారికంగా భర్తీ చేసింది.

Next Story