గూగుల్ సెర్చి ఇంజిన్‌లో సమస్యలు.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు

by Muthe.Rajitha |

గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలకు అంతరాయం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గూగుల్ సెర్చి ఇంజిన్‌లో సమస్యలు.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు
X

దిశ, వెబ్ డెస్క్ : గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలకు మంగళవారం అంతరాయం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం సుమారు 10 గంటల నుంచి సెర్చ్ రిజల్ట్స్ పేజీలు లోడ్ కాకపోవడం, సర్వర్ ఎర్రర్ మెసేజ్‌లు రావడం వంటి సమస్యలు తలెత్తాయి. డౌన్‌డెటెక్టర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో 3,300 రిపోర్టులు నమోదు కావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా భారత్, యూరప్, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

సాధారణంగా గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తమ సర్వర్లలో అప్‌డేట్లు చేసేటప్పుడు లేదా బ్యాక్-ఎండ్ కోడింగ్‌లో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు ఇలాంటి 'బ్లాంక్ పేజీ' సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్య వల్ల విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులు, సమాచారం కోసం సెర్చ్ ఇంజిన్‌పై ఆధారపడే సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గూగుల్ వర్క్‌స్పేస్ సేవలపై దీని ప్రభావం ఎంతవరకు ఉందనే దానిపై కంపెనీ నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది.

Next Story