- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
by Malleboina Mahesh |
పండగ పూట ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో షాకింగ్ కు గురి చేసింది. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లాలోని కావలి వద్ద చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: పండగ పూట ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో (Goods train derailed) షాకింగ్‌కు గురి చేసింది. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లాలోని కావలి వద్ద చోటు చేసుకుంది. ఈ గూడ్స్ రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా పట్టాలు తప్పినట్లు తెలుస్తుంది. రెండు బోగీలో ట్రాక్ పైకి రావడంతో.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర ప్రభావం పడింది. ఈ సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. ఆ మార్గంలో వెళ్లే రైళ్లను స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని రైల్ ట్రాక్ పునరుద్దరన చర్యలు చేపట్టారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గం గుండా వెళ్లే ప్యాసింజర్ రైళ్లు ఆలస్యం కావడంతో.. పండగ కోసం ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతూ.. ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






