- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు!
ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్; బల్క్ ఎఫ్డీలపై (రూ. 3 కోట్లు పైబడి) వడ్డీ రేట్లు పెంపు. ఏడాది నుండి రెండేళ్ల డిపాజిట్లపై వడ్డీ 6.50%కి పెంపు.

దిశ, వెబ్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్న కస్టమర్లకు తీపి కబురు అందించింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై (రూ. 3 కోట్ల కంటే ఎక్కువ) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా సవరించిన ధరల ప్రకారం, ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్లకు ఎప్పుడూ అదనపు వడ్డీ లభిస్తుంది. వీరి కోసం 180 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.10 శాతం నుంచి 6.35 శాతానికి, ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్లపై 6.75 శాతం నుంచి 7.00 శాతానికి పెరిగింది.
ఈ కొత్త వడ్డీ రేట్లు కొత్తగా చేసే డిపాజిట్లకు, మెచ్యూరిటీ తర్వాత రెన్యువల్ చేసే డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయని ఈ సందర్భంగా SBI స్పష్టం చేసింది. అయితే, బల్క్ టర్మ్ డిపాజిట్లను గడువు ముందే విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం పెనాల్టీ యథాతథంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్న తరుణంలో ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునే వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మంచి లాభదాయకంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






