- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : EPF చందాదారులకు శుభవార్త. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా ఈపీఎఫ్ (PF) మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ ఫారాలు పెట్టి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. నూతన విధానంలో యూపీఐ పిన్ ఎంటర్ చేసి క్షణాల్లోనే నగదును ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత మొత్తం విత్‌డ్రా చేయొచ్చో ముందే తెలుసుకోవచ్చు. ఒకసారి డబ్బు బ్యాంక్ ఖాతాలోకి వచ్చాక యూపీఐ ద్వారా ఖర్చు చేయొచ్చు లేదా డెబిట్ కార్డ్‌తో ఏటీఎం నుంచి తీసుకోవచ్చు.
ఇప్పటికే ఈపీఎఫ్‌ఓ ఆటో సెటిల్‌మెంట్ లిమిట్‌ను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచి, దానిని 3 రోజుల్లోనే ఖాతాలో జమయ్యేలా చేసింది. కనీసంగా 25 శాతం బ్యాలెన్స్ ఉంచి, మిగిలిన మొత్తంలో అర్హత మేరకు 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ కొత్త యూపీఐ విధానం విజయవంతం అయ్యేందుకు, అలాగే ఇందులో ఉన్న సాఫ్ట్‌వేర్ సమస్యలను పరిష్కరించడంపై ఈపీఎఫ్‌ఓ దృష్టి పెట్టింది. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చి, ఏప్రిల్ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.






