- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామాన్యులకు పండుగలాంటి వార్త .. ఒక్కసారిగా దిగొచ్చిన బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీయంగా బులియన్ మార్కెట్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో ఇవాళ హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్‌లో ఒక్క రోజులోనే 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారంపై రూ.8,230 తగ్గి రూ.1,70,620 వద్ద కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సామాన్యులకు బంగారం (Gold) ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీయంగా బులియన్ మార్కెట్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో ఇవాళ హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్‌లో ఒక్క రోజులోనే 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారంపై రూ.8,230 తగ్గి రూ.1,70,620 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.7,550 తగ్గుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల ధర రూ.1,56,400కి చేరింది. అదేవిధంగా బంగారంతో పోటీ పడుతూ పరుగులు పెట్టిన వెండి ధర కూడా నేడు భారీగా క్షీణించింది. కిలో వెండిపై ఏకంగా రూ.10 వేల మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 4,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
ధరల తగ్గుదలకు కారణాలు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో మార్పులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన అమ్మకాల ఒత్తిడి కారణంగానే ఈ భారీ తగ్గుదల నమోదైనట్లుగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ఈ ధరల తగ్గుదల మధ్యతరగతి వినియోగదారులకు, పసిడి ప్రియులకు పెద్ద ఊరటనిచ్చే అంశమే.






