- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో ఆదివారం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.4,370 పెరిగి రూ.1,73,080కు చేరుకోగా, కేజీ వెండి ధర ఏకంగా రూ.3,25,000 మార్కును తాకింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేడయం మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ తీవ్ర యుద్ధం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ బులియన్ మార్కెట్‌పై భారీగా పడింది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడం, సురక్షితమైన పెట్టుబడిగా పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో, ఆదివారం (మార్చి 1) నాడు బంగారం, వెండి ధరలు చారిత్రక స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.4,370 పెరిగింది. అలాగే రూ.1,73,080కు చేరింది. అలాగే.. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.4,000 ఎగబాకి రూ.1,58,650 వద్ద పలుకుతోంది.
తాజా పరిణామాలతో బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధరపై ఒక్కరోజే రూ.5,000 పెరగడంతో.. అది రూ.3,25,000 మార్కును తాకింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల దృష్ట్యా ఈ ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అనూహ్య పెరుగుదల సామాన్య ప్రజలను, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం నగలు కొనుగోలు చేయాలనుకునే వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.






