- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ మార్కెట్ అస్థిరత.. ఫోన్‌పే ఐపీఓ వాయిదా
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా పబ్లిక్ లిస్టింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన ఫోన్‌పే.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ 'ఫోన్‌పే' (PhonePe) తన పబ్లిక్ మార్కెట్ లిస్టింగ్ (IPO) కు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ చివరి నిమిషంలో అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. ఈ క్రమంలో ఫోన్‌పే ఐపీఓ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical conflicts), స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ మూలధన మార్కెట్లలో కొంత స్థిరత్వం ఏర్పడిన తర్వాతే మళ్లీ లిస్టింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ప్రభావిత ప్రాంతాల్లో త్వరలోనే శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నామని, భారత్‌లో పబ్లిక్ లిస్టింగ్‌కు తాము కట్టుబడి ఉన్నామని ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ ఈ సందర్భంగా తెలిపారు.
2016లో ప్రారంభమైన ఫోన్‌పే, డిజిటల్ పేమెంట్స్ రంగంలో అసాధారణ వృద్ధిని సాధించింది. సెప్టెంబర్ 30, 2025 నాటికి ఈ ప్లాట్‌ఫారమ్‌లో 65 కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు ఉండగా, 4.7 కోట్లకు పైగా వ్యాపార సంస్థలతో నెట్‌వర్క్ విస్తరించి ఉంది. కేవలం చెల్లింపులే కాకుండా డిజిటల్ డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లెండింగ్, ఇన్సూరెన్స్‌తో పాటు 'షేర్ మార్కెట్' (స్టాక్ బ్రోకింగ్), 'ఇండస్ యాప్‌స్టోర్' వంటి కొత్త ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ఫోన్‌పే తన సేవలను విస్తరించింది. ఐపీఓ వాయిదా వేసినప్పటికీ, కంపెనీ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని, దీర్ఘకాలిక లక్ష్యాల వైపు పయనిస్తామని ఈ సందర్భంగా సంస్థ పేర్కొంది.






