- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైక్లోన్ ఎఫెక్ట్.. ఇటలీని ముంచెత్తుతున్న రాకాసి అలలు
సైక్లోన్ హ్యారీ ఇటలీలోని దక్షిణ భాగాన్ని అతలాకుతలం చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : సైక్లోన్ హ్యారీ ఇటలీలోని దక్షిణ భాగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇటలీ దక్షిణ ప్రాంతాలైన సిసిలీ, సార్డినియా, కలాబ్రియా రాష్ట్రాలు ప్రస్తుతం సైక్లోన్ హ్యారీ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. మెడిటరేనియన్ సముద్రంలో ఏర్పడిన సైక్లోన్.. జనవరి 21 ఉదయం నాటికి గరిష్ట స్థాయికి చేరింది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో, కొన్ని చోట్ల 150 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తున్నాయి. సముద్రంలో భారీ అలలు ఎగసిపడటంతో తీర ప్రాంతాల్లో వరదలు వచ్చాయి.
ఇళ్లు, రోడ్లు నీటమునిగాయి. 48 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్లకుపైగా వర్షం కురవడంతో భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిసిలీ, సార్డినియా, కలాబ్రియాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసి..స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఫెర్రీ సర్వీసులు నిలిపివేశారు. తీర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిసిలీలోని పాలర్మో, కటానియా, మెస్సినా ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి.
ప్రస్తుతం సైక్లోన్ హ్యారీ క్రమంగా బలహీనపడుతూ తూర్పు దిశగా కదులుతున్నప్పటికీ.. మరో రెండు రోజులు దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లవద్దని టలీ సివిల్ ప్రొటెక్షన్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.






