- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి గెరాల్డ్ కోయెట్జీ.. డేవిడ్ పేన్ స్థానంలో ఎంట్రీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి గెరాల్డ్ కోయెట్జీ! గాయపడిన డేవిడ్ పేన్ స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్‌ను రూ. 2 కోట్లకు ఒప్పందం చేసుకున్న ఎస్ఆర్‌హెచ్.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్లేయర్లు జట్లకు దూరం అయ్యారు. దీంతో అయా జట్లు వారి స్థానంలో కొత్త వారిని రిప్లేస్ చేసుకుంటున్నాయి. ఈ గాయాల బెడద సన్ రైజర్స్ జట్టుపై కూడా పడింది. గాయంతో టోర్నీకి దూరమైన ఇంగ్లాండ్ ఎడమచేతి వాటం పేసర్ డేవిడ్ పేన్ స్థానంలో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అయిన గెరాల్డ్ కోయెట్జీని ఎంపిక చేసుకుంది. డేవిడ్ పేన్ తన చీలమండ (Ankle) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆయన ఈ సీజన్‌లో 2 మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు తీశారు. కోయెట్జీని రూ. 2 కోట్లకు సన్‌రైజర్స్ ఒప్పందం చేసుకుంది.
24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ దక్షిణాఫ్రికా తరపున 18 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడి 22 వికెట్లు తీశాడు. గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అనుభవం అతనికి ఉంది. ఒకవైపు కోయెట్జీ రాకతో పాటు, సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా తిరిగి జట్టుతో చేరడం అభిమానులకు శుభవార్త. ఆయన ఏప్రిల్ 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కోయెట్జీ తన వేగం, దూకుడుతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగానికి కొత్త ఊపును ఇస్తాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఎస్ఆర్‌హెచ్, ఈరోజు (ఏప్రిల్ 18) చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.






