విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భారత ప్రగతిపై గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

భారత ఇంధన రంగం 500 గిగావాట్ల మైలురాయిని దాటిందని గౌతమ్ అదానీ వెల్లడించారు. 2047 నాటికి 2,000 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారత్, ప్రపంచానికి కొత్త వృద్ధి నమూనాను చూపిస్తోందని ఆయన కొనియాడారు.

విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భారత ప్రగతిపై గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) భారత ఆర్థిక వృద్ధి, ఇంధన రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన వృద్ధి పథాన్ని సృష్టించుకుందని, అమెరికా, చైనా నమూనాలను మనం అనుసరించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నగరాలు, పెరుగుతున్న గృహ అవసరాలు, వేగంగా పుంజుకుంటున్న చిన్న తరహా పరిశ్రమల కారణంగా మన దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువుకు, సేవకు ముందే డిమాండ్ సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలను నిర్మించడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యమని ఈ సందర్భంగా అదానీ పేర్కొన్నారు.

ముఖ్యంగా ఇంధన రంగంలో భారత్ అసాధారణ ప్రగతి సాధించిందని అదానీ కొనియాడారు. మార్చి 2026 నాటికి దేశం 500 గిగావాట్ల (GW) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అధిగమించిందని, ఇందులో 53 శాతం సామర్థ్యం గడిచిన పదేళ్లలోనే జోడించబడటం విశేషమని ఆయన వెల్లడించారు. ఇదే వేగంతో ముందుకు సాగుతూ, 2047 నాటికి దేశ విద్యుత్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచి 2000 గిగావాట్లకు చేర్చడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ అవసరాల కోసం మాత్రమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న భారత్ యొక్క ప్రస్తుత అవసరాలను తీర్చే దిశగా ఈ నిర్మాణాలు సాగుతున్నాయని అదానీ స్పష్టం చేశారు.

Next Story