నిమ్మరసానికి గ్యాస్ ట్యాక్స్.. కస్టమర్ షాక్

by Muthe.Rajitha |

బెంగుళూరులోని ఓ కేఫ్ లో నిమ్మరసానికి కూడా గ్యాస్ ట్యాక్స్ వేయడంతో కస్టమర్ కంగుతిన్నాడు.

నిమ్మరసానికి గ్యాస్ ట్యాక్స్.. కస్టమర్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంధన సంక్షోభం సాకుతో కొన్ని హోటళ్లు కస్టమర్లపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. బెంగళూరులోని 'థియో కెఫే' (Theo Cafe) లో ఒక కస్టమర్ రెండు మింట్ లెమనేడ్స్ ఆర్డర్ చేయగా, బిల్లులో 5 శాతం "గ్యాస్ క్రైసిస్ ఛార్జ్" (Gas Crisis Charge) పేరుతో రూ. 17.01 అదనంగా వసూలు చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు నిమ్మరసం తయారు చేయడానికి గ్యాస్ అవసరం లేనప్పుడు, ఈ టాక్స్ ఎందుకు వేస్తున్నారని కస్టమర్ షాక్ తిన్నాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "నిమ్మకాయలను వేడి చేసి రసం తీశారా?" అని కొందరు ఎద్దేవా చేస్తుంటే, మరికొందరు ఇలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘన అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 9 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే దోశ, వడ, పూరి వంటి పదార్థాలను హోటల్ యజమానులు మెనూ నుంచి తాత్కాలికంగా తొలగించారు. తక్కువ గ్యాస్ ఖర్చయ్యే, ఎలక్ట్రిక్ స్టవ్‌లపై తయారు చేయగలిగే బ్రెడ్, శాండ్‌విచ్ వంటి పదార్థాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, హోటల్ యజమానులు మళ్లీ పాతకాలం నాటి కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నారు.

Next Story