కేఎల్ రాహుల్‌కు గంభీర్ వార్నింగ్.. కెప్టెన్ అయినంత మాత్రనా ఆ గ్యారంటీ లేదు..

by Disha Web |
కేఎల్ రాహుల్‌కు గంభీర్ వార్నింగ్.. కెప్టెన్ అయినంత మాత్రనా ఆ గ్యారంటీ లేదు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజ్ కొత్తగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. మాజీ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉన్నాడు. అయితే.. ఐపీఎల్ ప్రారంభానికి ముందే తమ జట్టు సారథి కేఎల్ రాహుల్‌ను గంభీర్ హెచ్చరించాడు. ఐపీఎల్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించినంత మాత్రాన.. అది టీమిండియా కెప్టెన్సీకి గ్యారంటీ కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రాహుల్‌కు చురకలంటించాడు. లక్నో జట్టుకు కావాల్సింది జట్టును నడిపించే బ్యాటర్ కానీ.. బ్యాటింగ్ చేసే కెప్టెన్ కాదని ఈ రెండింటికి చాలా తేడా ఉంటుందని సూచించాడు. అంతే కాకుండా కెప్టెన్ అనేవాడు ఖచ్చితంగా గ్రౌండ్‌లో కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అలాంటప్పుడే ఫలితాలను రాబట్టగలమని తెలిపాడు. ఈ విషయాన్ని రాహుల్ అర్థం చేసుకుంటాడని అనుకుంటున్న అని పేర్కొన్నాడు.

Next Story

Most Viewed