ఫుల్ బాటిల్‌తో ఫుల్ ప్రాఫిట్ అందుకోనున్న సత్యదేవ్

by Dishanational2 |
ఫుల్ బాటిల్‌తో ఫుల్ ప్రాఫిట్ అందుకోనున్న సత్యదేవ్
X

దిశ, సినిమా : టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్‌‌లో సత్యదేవ్ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ మొదట్లో సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితమైన ఈ నటుడు.. వైవిధ్యమైన కథలు, విలక్షణమైన పాత్రలతో తనకంటూ సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఓ వైపు హీరోగా రాణిస్తూనే ఇటీవల 'SD కంపెనీ' పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన సత్యదేవ్.. ఇప్పుడు ఇదే బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న 'ఫుల్ బాటిల్' చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు.

శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో 78.1 % వినోదం, 21.9% యాక్షన్ ఉంటుందని పేర్కొన్నాడు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించడంతో పాటు టైటిల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఒక ఆటోలోని డ్రైవింగ్ సీట్‌లో అబ్బాయి, బ్యాక్ సీట్‌లో అమ్మాయి కూర్చొని ఉండగా.. ఆటోపైన ఒక మందు సీసాలో 'ఫుల్ బాటిల్'' టైటిల్ డిజైన్ చేయబడింది. ఇక ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో సత్యదేవ్ ఒక తాగుబోతుగా కనిపించనుండటం విశేషం.

Next Story