చాలా కాలం తర్వాత మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను.. థమన్ ట్వీట్ వైరల్

by Dishafeatures2 |
చాలా కాలం తర్వాత మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను.. థమన్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: ప్రభాస్, పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్' త్వరలో పాన్ ఇండియా మార్కెట్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా.. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తున్న ఆయన సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ పంచుకున్నాడు. 'మా నుంచి ఒక క్రేజీయెస్ట్ స్కోర్‌ను మీరంతా వినబోతున్నారు. ముందు ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ మీకోసం రాబోతున్నాయి. చాలా కాలం తర్వాత ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను' అంటూ అభిమానుల్లో ఆసక్తి రేకిత్తించాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై స్పందిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ 'థమన్ బయ్యా.. మరో అఖండ లెవల్లోనే ఉండబోతుంది కదా..' అంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story

Most Viewed