ఇసుక తవ్వకాలతో మానేరు చెంత.. మంచినీటికి చింత

by Malleboina Mahesh |

మానేరు చెంత మంచినీటికి చింత! ఇసుక తవ్వకాలతో ఎండిన బావి.. తాగునీరు లేక ఊటూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం. ఇసుక మాఫియాపై గ్రామస్తుల మహా ఉద్యమం.

ఇసుక తవ్వకాలతో మానేరు చెంత.. మంచినీటికి చింత
X

దిశ, మానకొండూరు : మానేరు చెంత మంచినీటి చింత వినడానికి వింతగా ఉన్న ఇది అక్షర సత్యం. ఒకప్పుడు సాగునీరు పుష్కలంగా ఉండి పచ్చని పంటపొలాలతో విలసిల్లిన గ్రామం తాగేందుకు కోబ్బరి నీళ్ల లాంటి తియ్యటి మంచినీళ్లు తాగి ఆరోగ్యకర వాతావరణంలో కాలం వెళ్లదీసిన గ్రామం ఇప్పుడు దాహార్తితో సతమతమవుతుంది. మంచినీరు అందక కెమికల్ నీళ్లు తాగి ఆనారోగ్యాలతో గ్రామస్తులు మృత్యువాత పడుతున్నారు. దాహం తీరే దారి చూడండి అంటు పాలకులను వేడుకుంటున్నారు తక్షణమే ఇసుక తవ్వకాలను ఆపాలంటూ ఆందోళన బాట పడుతున్నారు.

మానేటిలో చెలిమ తోడి చేతితో నీటిని తోడుకుని దాహార్తి తీర్చుకున్న గ్రామస్తులకు జేసిబీలు పెట్టి తోడిన నీరు కంటికి కనపడకపోవడం ఆందోళనకు కారణమవుతుంది. దీంతో గ్రామస్తులు మంచినీటి కోసం మహా ఉద్యమానికి తెరలేపారు తాగునీటి కోసం గ్రామస్తులు తనువు చాలించేదుకు సిద్ధమవుతూ పోరాడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇసుక తవ్వకాలను ఆపాలంటూ అడ్డుకోవడం తక్షణమే ఇసుక తవ్వకాలను ఆపక పోతే పురుగుల మందు తాగి మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాం అంటూ ఆందోళనకు దిగారు.

ఇసుక తవ్వకాలతో ఇబ్బందులు

మానేరు చెంత ఉండటం ఆ గ్రామానికి శాపంగా పరిణమించింది. ఒకప్పుడు పంచని పంట పొలాలతో విలసిల్లిన గ్రామం ప్రభుత్వం ఇసుక తవ్వకాల పేరుతో ఇసుక రీచ్ లను ఏర్పాటు చేయడం వాటి పై అధికారుల నియంత్రణ లేని కారణంగా రీచ్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు చేపట్టడం మానేరు వాగులో భూగర్భ జలాలు అడుగంటి పాతాళానికి పడిపోయాయి. దీంతో మానేరు పరివాహక గ్రామాల్లో తాగు సాగునీటికి తీవ్ర ఎద్దడి ఏర్పడింది. అయితే ప్రభుత్వ అనుమతి పేరుమీద ఇసుక మాఫియా మానేరు వాగులో తవ్వకాలు చేపట్టడం పై గ్రామస్తుల ఆగ్రహానికి కారణమవుతుంది. తాజాగా మానేరులోని గ్రామానికి మంచి నీటిని అందించే మంచి నీళ్ల బావి దగ్గర ఇసుక తవ్వకాలు చేపట్టడం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆందోళనకు దిగారు తవ్వకాలను అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది

మామూళ్ల మత్తులో అధికారులు

గ్రామంలో తాగేందుకు మంచినీరు అందక ఆరోగ్యాలు పాడవుతున్నాయి తాగునీరు నీరు లేక మా పిల్లలు దాహంతో గోంతులు ఎండిపోతున్నాయి? ఇక కుటుంబాలు మంచినీటి కోసం అల్లాడుతుంటే మేము బతకడం ఎందుకు?" అంటూ ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. గ్రామస్తులు సమయస్ఫూర్తితో ఆ యువకుడిని అడ్డుకుని నచ్చచెప్పడం తో పరిస్థితి శాంతించగా ఇప్పుడు యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతు గ్రామస్తులను కలచివేసింది.

ఇసుక రీచ్ నిర్వాహకులు ఇచ్చే మామూళ్ల మత్తులో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.తమ గ్రామానికి వెన్నెముక లాంటి మానేరు వాగును ఇసుక బకాసురులు మింగేస్తున్నారని, బావి చుట్టూ ఇసుక తీయడం వల్ల తాగడానికి నీరు దొరకడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.ఇసుక రీచ్ నిర్వాహకులకు మళ్లీ అనుమతులు ఇవ్వవద్దని ఊటూరు గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు వేడుకుంటున్నారు. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Next Story