- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ లో ఫ్రీ సినిమాలు
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, నాంపల్లిలోని లలితాకళాతోరణం ఓపెన్ థియేటర్ వేదికపై ఉచితంగా సినిమాలను ప్రదర్శిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ బహిరంగ కళా వేదిక 'లలితాకళాతోరణం' మళ్లీ కళకళలాడుతోంది. తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ ప్రాంగణంలో ఉన్న లలితాకళాతోరణం ఓపెన్ థియేటర్ వేదికపై ఉచితంగా సినిమాలను ప్రదర్శిస్తున్నారు. స్థానిక కళాక్షేత్రాలను సజీవంగా ఉంచాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఐదు రోజుల ప్రత్యేక ప్రదర్శనలు
ఏప్రిల్ 14న ప్రారంభమైన ఈ ఐదు రోజుల సినిమా పండుగ, ఏప్రిల్ 18 వరకు కొనసాగుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటలకు అత్యాధునిక జెయింట్ ఎల్‌ఈడీ (LED) స్క్రీన్‌పై అవార్డు విన్నింగ్ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. సుమారు 4,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ ఓపెన్-ఎయిర్ థియేటర్‌లో సినిమా చూడటం ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఏప్రిల్ 15న కోర్ట్ (Court), ఏప్రిల్ 16న తండేల్ (Thandel), ఏప్రిల్ 17న బలగం (Balagam), ఏప్రిల్ 18న జనతా గ్యారేజ్ (Janatha Garage) సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలకు ప్రవేశం పూర్తిగా ఉచితం. మల్టీప్లెక్స్‌లకు భిన్నంగా, బహిరంగ ఆకాశం కింద, చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమాలు చూడటానికి ఇది చక్కని అవకాశం అని అధికారులు చెబుతున్నారు. నగరంలోని సినిమా అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పౌరులను కోరింది.






