ఎంబాపె గోల్.. సెమీ ఫైనల్స్ లోకి ఫ్రాన్స్

by Muthe.Rajitha |

ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) లో ఫ్రాన్స్ జట్టు తన జోరును కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఎంబాపె గోల్.. సెమీ ఫైనల్స్ లోకి ఫ్రాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) లో ఫ్రాన్స్ జట్టు తన జోరును కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో డిఫెండింగ్ శక్తులు కలిగిన మొరాకోను ఫ్రాన్స్ 2-0 తేడాతో చిత్తు చేసింది. ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె మరోసారి మెరుపులు మెరిపిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఎంబాపె, డెంబెలె మేజిక్

మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఫ్రాన్స్ జట్టుకు స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో తొలి ఆధిక్యాన్ని అందించాడు. మొరాకో డిఫెండర్లను ముప్ప తిప్పలు పెడుతూ ఆయన చేసిన గోల్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఉస్మానే డెంబెలె కూడా మొరాకో డిఫెన్స్‌ను ఛేదిస్తూ రెండో గోల్ కొట్టాడు. మొరాకో ఆటగాళ్లు గోల్ కోసం గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, ఫ్రాన్స్ బలమైన రక్షణ శ్రేణిని దాటలేకపోయారు.

2022 సెమీఫైనల్ సీన్ రీప్లే!

ఈ విజయం గత ప్రపంచకప్ జ్ఞాపకాలను గుర్తుచేసింది. ఖతార్ వేదికగా జరిగిన 2022 ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లోనూ ఫ్రాన్స్ జట్టు ఇదే తరహాలో 2-0 స్కోరు తేడాతో మొరాకోను ఓడించి ఇంటికి పంపింది. ఇప్పుడు క్వార్టర్స్ మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ మొరాకోపై తన ఆధిపత్యాన్ని ఫ్రాన్స్ మరోసారి నిరూపించుకుంది. మంగళవారం డాలస్‌లో జరగబోయే హై-వోల్టేజ్ సెమీఫైనల్స్ మ్యాచ్‌లో తలపడనుంది. స్పెయిన్ లేదా బెల్జియం దేశాల మధ్య జరిగే మరో క్వార్టర్స్ విజేతతో ఫ్రాన్స్ ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనుంది.

Next Story