- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు దుర్మరణం
by Gantepaka Srikanth |
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వ్యవసాయ పనుల నిమిత్తం పసుపు రిక్కడానికి వెళ్లిన మహిళలు.. తమ పనిని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పసుపు లోడుతో ఉన్న ట్రాక్టర్‌లో ఎక్కారు. మార్గంమధ్యలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్‌లో సుమారు 8 మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






