- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ రెండో రోజు పరీక్షల్లో 4 మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు
తెలంగాణ ఇంటర్ రెండో రోజు పరీక్షల్లో 4 మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు అయ్యాయని ఇంటర్ బోర్డు పేర్కొంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన ఇంటర్ సెకండియర్ సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-II) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు మొత్తంగా 97.76 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు మొత్తం 463354 విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 452980 మంది హాజరయ్యారు. 10,374 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మొత్తం 4 మాల్-ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో వరంగల్ జిల్లాలో 3 కేసులు, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. వనపర్తి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, సిద్ధిపేట, మెదక్, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను వీరు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
- Tags
- inter exams 2026






