జెట్ ఎయిర్‌వేస్ సీఎఫ్ఓగా విపుల గుణతిలక!

by Web Desk |
జెట్ ఎయిర్‌వేస్ సీఎఫ్ఓగా విపుల గుణతిలక!
X

దిశ, వెబ్‌డెస్క్: జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం జెట్ ఎయిర్‌వేస్‌కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌(సీఎఫ్ఓ)గా విపుల గుణతిలకను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి వరకు విపుల గుణతిలక ఇదివరకు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు సీఈఓగా పనిచేశారు. జెట్ ఎయిర్‌వేస్‌ను పునరుద్ధరించేందుకు సీఎఫ్ఓగా మార్చి 1 నుంచి ఆయన బాధ్యతలను చేపట్టనున్నారని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

'కరోనా మహమ్మారి సమయంలో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు నాయకత్వం వహించిన విపుల గుణతిలక అత్యంత క్లిష్టమైన సమయంలో ఎయిర్‌లైన్స్‌ను గాడిలో పెట్టారు. కేవలం రెండేళ్ల కాలంలో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ను పునర్నిర్మించారు. మెరుగైన సేవలతో పాటు సామర్థ్యాలను మెరుగుపరచడంలో కీలక నిర్ణయాల ద్వారా శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ను రెండుసార్లు ప్రపంచ అత్యంత విలువైన ఎయిర్‌లైన్స్‌గా నిలపడంతో గుర్తింపు పొందారు.

దీంతో టర్న్అరౌండ్ స్పెషలిస్ట్‌గా మారిన విపుల గుణతిలకను గత కొన్ని నెలల నుంచి తమ ఎగ్జిక్యూటివ్ బృందం అనేక ప్రక్రియల తర్వాత ఎంపిక చేసిందని, ఆయన సంస్థలో చేరడం సంతోషంగా ఉందని' జెట్ ఎయిర్‌వేస్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు అంకిత్ జలాన్ చెప్పారు. జెట్ ఎయిర్‌వేస్‌లో చేరడం సంతోషంగా ఉంది. సంస్థకు పునరుజ్జీవన అందించేందుకు తన 30 ఏళ్ల అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను. రానున్న రోజుల్లో జెట్ ఎయిర్‌వేస్ విమానయాన మార్కెట్లో బలమైన బ్రాండ్‌గా నిలుస్తుందని' విపుల గుణతిలక అన్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story