స్వీట్లు, టపాకులు తెచ్చాం.. వరల్డ్ కప్ కు ఎంపిక కాకపోవడంపై రింకూ తండ్రి స్పందన

by Dishanational6 |
స్వీట్లు, టపాకులు తెచ్చాం.. వరల్డ్ కప్ కు ఎంపిక కాకపోవడంపై రింకూ తండ్రి స్పందన
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టుని ప్రకటించింది. అయితే, రింకూ సింగ్ కు చోటు దక్కకపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సెలెక్టర్లు రింకూని ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికచేశారు. అయితే రింకూకు చోటు దక్కకపోవడంపై చాలా మంది మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలక్టర్లపైనా అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి టైంలో రింకూ సింగ్ తండ్రి ఖన్ చంద్ర సింగ్ స్పందించాడు.

రింకూ వరల్డ్‌కప్‌ జట్టులో ఉంటాడని తమకు పూర్తి నమ్మకం ఉందని ఇంటర్వ్యూలో అన్నారు. సంబురాలు చేసుకునేందుకు స్వీట్లు, టపాసులు కూడా తెచ్చుకున్నామని తెలిపారు. రింకూ వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికవడమే కాకుండా తుది జట్టులో కూడా ఉంటాడని ఊహించామని అనుకున్నారు. కానీ అలా జరగలేదని.. రింకూ చాలా బాధపడ్డారని పేర్కొన్నారు. ఈ విషయంలో తన తల్లికి రింకూ చాలా సర్దిచెప్పారని అన్నారు. 15 మందిలో లేనపోయినా జట్టుతో పాటు వెళ్తానని ఆమెతో చెప్పాడని అన్నారు.

కాగా, 26 ఏళ్ల రింకూ టీమిండియా తరఫున ఫినిషర్ పాత్ర పోషిస్తున్నేడు. అతను ఆడిన 15 టీ20ల్లో 176.2 స్ట్రయిక్ రేట్ తో 89 సగటున 356 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అయినప్పటికీ.. వరల్డ్ కప్ లో రింకూకు చోటు దక్కలేదు

టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా

రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

Next Story