తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ అవసరమా..? సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 19 |
తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ అవసరమా..? సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లు కేసీఆర్ పెట్టిన కేసులకు భయపడ్డమా..? ఇప్పుడు మోడీ పెట్టిన కేసులకు భయపడతామా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఉంటే గెలుపు సాధ్యం కాదని మోడీ, కేసీఆర్ భావించినట్లున్నారని, అందుకే నాపై అక్రమ కేసులు పెట్టి ప్రచారం చేయకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. గుజరాత్ అధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి పోరాటం ఇది అన్నారు. బుధవారం శేరిలింగపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపీ, కర్నాటకకు మోడీ సర్కార్ ఇచ్చిందేమి లేదని, ఏపీకి మట్టి, కర్నాటకకు ఖాళీ చెంబు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు.

తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ మనకు అవసరమా అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, హైదరాబాద్‌కు ఐటీఐఆర్ మంజూరు చేసిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన ఉక్కు పరిశ్రమను, ఐటీఐఆర్‌ను మోడీ రద్దు చేశారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ఆలోచిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పేదలు ఉద్యోగాలు, రాజకీయాల్లో ఉన్నారంటే కాంగ్రెస్ కల్పించిన రిజర్వేషన్లే కారణమన్నారు. లక్ష కోట్లు ఖర్చు అయిన మూసీ ఆధునీకరించి తీరుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Read More...

బీజేపీ సభలో రాహుల్ మానియా!.. కాంగ్రెస్ సెటైర్ (వీడియో వైరల్)

Next Story