- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయ్: శ్రీనివాస్‌గౌడ్
పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు సరిగా రాకపోయే సరికి బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నయని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు సరిగా రాకపోయే సరికి బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నయని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర పొగడ్తలు మున్సిపల్ ఎన్నికల్లో వారు కుమ్మక్కు అవుతున్నట్టు స్పష్టంగా సూచిస్తున్నాయన్నారు. సీఎం మహబూబ్‌నగర్‌లో మాట్లాడిన తీరు ఎన్నికల్లో మాట్లాడినట్టుగానే ఉన్నదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు పథకాలు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. రేవంత్ తన తండ్రి చనిపోతే స్నానానికి నీళ్లు లేవని కరెంటోళ్లకు చెప్పి అరగంట మోటార్ ఆన్ చేసుకున్నామని అసెంబ్లీలో చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా అని నిలదీశారు. కేసీఆర్ పాలనలోనే పాలమూరు పరిస్థితులు మారాయని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ తీసుకురాకుంటే రేవంత్ సీఎం అయ్యేవారా అని.. నడుం విరగ్గొట్టి పడుకోబెట్టా అని నీచంగా మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఒక్కడే ప్రాధాన్యత ఇచ్చారు
‘నువ్వు ఏం చేస్తే అడ్డుపడ్డారని హరీశ్‌రావు, కేటీఆర్‌ను మారీచుడు, సుబాహుడు అంటున్నావు’అని నిలదీశారు. జూరాలలో నీళ్లు ఉంటే క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారన్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొచ్చి కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడాలన్నారు. మంత్రులకు దమ్ముంటే అశోక్‌నగర్ లైబ్రరీ సందర్శించాలని సవాల్ విసిరారు. మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మహిళా ఐఏఎస్ అధికారుల పరువును బజారుకీడుస్తున్నారని.. రాష్ట్రంలో వారు పనిచేయడానికి భయపడుతున్నారని అన్నారు. మాజీ మంత్రి సి.లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. నల్లమల్ల బిడ్డను అని చెప్పుకుని సీఎం నిత్యం ప్రజల మొహాలు నల్లగా చేసి వెళ్తున్నారని అన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.






