- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా అమోలో ఒడింగా సమావేశమయ్యారు. వ్యక్తిగత పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం మోడీని కలిసినట్లు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. దీనిని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 'కెన్యా మాజీ ప్రధాని నా స్నేహితుడైనా రైలా అమోలో ఒడింగాను కలుసుకోవడం ఆనందంగా ఉంది. భారతదేశం, కెన్యాలో అతనితో నా గత సమావేశాలను గుర్తు చేసుకున్నాను' అని మోడీ ట్వీట్ చేశారు. భారత్, కెన్యా బలమైన ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉన్నాయన్నారు. వీటిని మరింత బలోపేతం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నట్లు మోడీ తెలిపారు.
Next Story






