మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న నాకు బంధువు.. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ కేసు‌లో సిట్ నుంచి నోటీసులు అందకున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇవాళ విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌కు వచ్చారు.

మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న నాకు బంధువు.. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ నుంచి నోటీసులు అందకున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ (Jaipal Yadav) ఇవాళ విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ (Jubilee Hills Police Station)కు వచ్చారు. ఈ మేరకు ఆయనను అధికారులు 2 గంటల పాటు సుధీర్ఘంగా విచారించారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న (Tirupathanna)ను, జైపాల్ యాదవ్‌ను ఎదురెదురుగా కూర్చోబెట్టి అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఫోన్ నంబర్ల సేకరణ, వాటిని ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అనే కోణంలో అధికారులు ఆరా తీశారు. విచారణ అనంతరం జైపాల్ యాదవ్ తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

విచారణ అనంతరం బయటకు వచ్చిన జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ (SIB) అధికారులు తనను కల్వకుర్తికి చెందిన ఇద్దరు నేతల ఫోన్ నంబర్లు అడిగారని పేర్కొన్నారు. వారు అడిగితేనే ఆ నంబర్లు ఇచ్చానని అంతవరకే నాకు తెలుసని ఆయన స్పష్టం చేశారు. ఆ నంబర్లను అధికారులు ఎందుకు అడిగారు.. వాటిని ట్యాప్ చేశారా.. ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాలపై తనకు ఎటువంటి అవగాహన లేదన్నారు. తిరుపతన్నతో తనకున్న సంబంధంపై స్పందిస్తూ.. ఆయన తనకు బంధువని, అందుకే ఆయనతో సాధారణంగా టచ్‌లో ఉన్నానని జైపాల్ యాదవ్ చెప్పకొచ్చారు.

Next Story