డైటింగ్ చేస్తున్నారా.. అయితే, ఇవి తింటే బెటర్

by Dishanational2 |
డైటింగ్ చేస్తున్నారా.. అయితే, ఇవి తింటే బెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో చాలామంది స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్ల వంటి బయటి ఫుడ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి జంక్ ఫుడ్ మూలంగా అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా కొందరు మానలేకపోతుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు జంక్ ఫుడ్ స్థానంలో ప్రోటీన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆకలి వేసినప్పుడు సామాన్యంగా ఏది కనిపిస్తే దానిని తింటుంటారు. ఆ సమయంలో ఆరోగ్యానికి అది మంచిదా..? కాదా? అనేది ఏదీ ఆలోచించరు, ఆకలి తీరిందా లేదా? అనే చూస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కువగా అనారోగ్యాల పాలవుతుంటారు. అంతేగాక, శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో హెల్త్ నిపుణులు కీలక సూచనలు చేశారు. ఆరోగ్యానికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేస్తున్నారు. రక్తం సరిగా లేని వాళ్ళు క్యారేట్, బీట్ రూట్, తీసుకోవాలి. పిల్లలు, మహిళలు ప్రోటీన్స్ ఉన్న గుడ్లు, పాలు, చేపాలు, చికెన్, బాదం, వంటివి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. అంతేగాక, రోజూ రెండు గుడ్లు, గ్లాస్ పాలు, చికెన్, చేపలు, బాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా డైటింగ్ చేసేవాళ్లు ఇవి రోజూ లైట్‌గా తీసుకుంటే శరీరాకృతిలో చాలా మార్పు కనిపిస్తుందని సూచిస్తున్నారు.



Next Story

Most Viewed