Flipkart: బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్‌‌లపై భారీ తగ్గింపు

by Disha Web Desk 17 |
Flipkart: బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్‌‌లపై భారీ తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను తెచ్చింది. ఈ సేల్ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 14 వరకు ఉంటుంది. బిగ్ సేవింగ్ డేస్ టైంలో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై డీల్‌లు, ఆఫర్‌లు ఉన్నాయి. Samsung Galaxy F23 5G, Redmi Note 10T 5G, Moto G31 వంటి వాటిపై ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ఇతర కస్టమర్‌ల కంటే 12 గంటల ముందుగానే డీల్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. ICICI బ్యాంక్ కస్టమర్‌లు తక్షణ తగ్గింపులను కూడా పొందవచ్చు. Samsung, Motorola, Xiaomi, Realme వంటి మరిన్ని బ్రాండ్‌లపై వివిధ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. Flipkart ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా ఉంది.

Samsung Galaxy F23 5G

ఫ్లిప్‌కార్ట్ Samsung Galaxy F23 5G స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపును అందిస్తోంది. దీని ధర రూ.22,999. సేల్‌లో భాగంగా ఈ ఫోన్ రూ. 15,999కే లభిస్తుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ EMI లావాదేవీలపై రూ.1,000 తక్షణ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.

Redmi Note 10T 5G

ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.16,999. ఆఫర్‌లో భాగంగా ఫోన్ రూ. 13,999కి లభిస్తుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ EMI లావాదేవీలపై రూ.1,000 తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. కస్టమర్‌లు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ రూ.10,999 తగ్గింపు కూడా పొందవచ్చు.

Motorola ఎడ్జ్ 20 ఫ్యూజన్

ఫోన్ ప్రస్తుతం ధర రూ. 25,999. కానీ ఆఫర్‌లలో భాగంగా ఇది రూ. 23,199కే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మైక్రోసైట్ ప్రకారం, విక్రయ టైంలో ఇతర ఆఫర్‌ల ద్వారా 19,499 లభించే అవకాశం ఉంది. హ్యాండ్‌సెట్‌కు ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ లేదు.

Realme 9 Pro+ 5G

స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 27,999. ఈ సేల్‌లో ఫోన్ రూ. 24,999 కి లభిస్తుంది. Flipkart మైక్రో సైట్ ప్రకారం, బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో రూ.19,999 కే లభించే అవకాశం ఉంది. అదనంగా కస్టమర్‌లు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.



Next Story

Most Viewed