- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.- latest Telugu news

X
దిశ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డి, సిరిసిల్ల రహదారిపై మాచారెడ్డి మండలం గన్‌పూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. అందులో ఒక బాలుడు మృతి చెందడంతో ఘటనా స్థలం హృదయవిదారకంగా మారింది. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి వైపు వస్తుండగా.. షిఫ్ట్ కార్‌లో కామారెడ్డి వైపు నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు కారులోనే విగతజీవులుగా మారగా బాలుడు మాత్రం డోర్ ఓపెన్ బయట పడి చనిపోయాడు. మృతుల వివరాల కోసం స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.
Next Story






