జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ

by Muthe.Rajitha |

శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఊరటనిచ్చే ప్రసిద్ధ 'చేప ప్రసాదం' పంపిణీకి హైదరాబాద్ సిద్ధమవుతోంది.

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్ : శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఊరటనిచ్చే ప్రసిద్ధ 'చేప ప్రసాదం' పంపిణీకి హైదరాబాద్ సిద్ధమవుతోంది. ప్రతి ఏటా మృగశిర కార్తెను పురస్కరించుకుని పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని ఈ ఏడాది జూన్ 8న ఇవ్వనున్నట్టు బత్తినికుటుంబం ప్రకటించింది. జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం, జూన్ 9వ తేదీ వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు కొనసాగుతుంది. ప్రధాన వేదికపై పంపిణీ పూర్తయిన తర్వాత కూడా దూద్‌బౌలిలోని వారి నివాసాల్లో ఈ ప్రసాదం అందుబాటులో ఉంటుందని వారు స్పష్టం చేశారు.

ఆస్తమా, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడే వేలాది మంది ప్రజలు దేశవిదేశాల నుండి ఈ ప్రసాదం కోసం నగరానికి తరలివచ్చే అవకాశం ఉండగా.. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం, మత్స్య శాఖ సంయుక్తంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భక్తులకు అవసరమైన తాగునీరు, పారిశుధ్యం, భద్రతా సౌకర్యాలను పర్యవేక్షించడంతో పాటు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది.

Next Story