ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

by Malleboina Mahesh |

ఆస్ట్రేలియాతో తొలి వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. టీ20 సిరీస్ విజయోత్సాహంతో బరిలోకి దిగిన హర్మన్ సేన. ప్రతికా రావల్ రీఎంట్రీ.

ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
X

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బ్రిస్బేన్‌లోని అలన్ బోర్డర్ ఫీల్డ్ వేదికగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమాత్రం తడబడకుండా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇప్పటికే ముగిసిన టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఆత్మవిశ్వాసంతో ఉన్న 'వుమెన్ ఇన్ బ్లూ', ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు సాధించి ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది.

భారత జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ ప్రతికా రావల్ తిరిగి జట్టులోకి రాగా, యువ బౌలర్ కాష్వీ గౌతమ్‌కు కూడా తుది జట్టులో అవకాశం లభించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ వంటి స్టార్ బ్యాటర్లతో భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. వన్డే ప్రపంచ ఛాంపియన్లుగా మొదటిసారి మైదానంలోకి దిగుతున్న భారత జట్టు, తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఈ మ్యాచ్‌ను కీలకంగా భావిస్తోంది.

మరోవైపు, ఆస్ట్రేలియా జట్టుకు స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ, కిమ్ గార్త్ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ గా మారింది. గాయాల కారణంగా వారు ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరని కెప్టెన్ అలిస్సా హీలీ ధృవీకరించారు. అయితే, అలిస్సా హీలీకి ఇది వీడ్కోలు సిరీస్ కావడంతో, ఆస్ట్రేలియా జట్టు ఆమెను ఘనంగా సాగనంపాలనే పట్టుదలతో ఉంది. ఫ్రెష్ పిచ్‌పై మొదట బౌలింగ్ చేయడం తమకు లాభిస్తుందని, భారత బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేస్తామని హీలీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా మహిళల ప్లేయింగ్ XI: అలిస్సా హీలీ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, బెత్ మూనీ (కెప్టెన్), అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలానా కింగ్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్

భారత మహిళల ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, ప్రతికా రావల్, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (కెప్టెన్), దీప్తి శర్మ, కాశ్వీ గౌతమ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్

Next Story