టైర్ల షోరూమ్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తిన‌ష్టం!

by Disha Web Desk 13 |
టైర్ల షోరూమ్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తిన‌ష్టం!
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప‌రిధి మ‌న్నెగూడ‌లోని ఓ టైర్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల మంట‌లు చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది. షోరూమ్‌లో నిల్వ ఉంచిన టైర్లు, కెమిక‌ల్‌, ప్లాస్టిక్ వ‌స్తువులు పూర్తిగా త‌గుల‌బ‌డిపోయాయి. పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగ‌డంతో ఆ ప్రాంతంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆదిభ‌ట్ల సీఐ న‌రేంద‌ర్‌, ఎస్ఐ ల‌క్ష్మీనారాయ‌ణ, సిబ్బంది ఆధ్వర్యంలో మూడు ఫైరింజ‌న్ల సాయంతో దాదాపు రెండుగంట‌ల పాటు క‌ష్టప‌డి అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.


ఈ ప్రమాదంలో సుమారు రూ.30 ల‌క్షల వ‌ర‌కు ఆస్తిన‌ష్టం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ షోరూమ్‌కి స‌మీపంలోనే స్కూల్‌, కోల్డ్ స్టోరేజీలు, బార్ అండ్ రెస్టారెంట్ ఉండ‌టంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. టైర్లు పెద్ద ఎత్తున త‌గుల‌బ‌టంలో వేడి, వాస‌న దాటికి స్థానికులు అవ‌స్థలు ప‌డ్డారు. పాఠ‌శాల విద్యార్థుల‌ను హుటాహుటిన వారి ఇళ్లకు పంపించి వేశారు. స‌హాయ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయ‌కులు కుంట గోపాల్‌రెడ్డి, మ‌ర్రి మ‌హేంద‌ర్‌రెడ్డి, మేత‌రి ద‌ర్శన్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed