- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ టు హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు.. ప్రయాణికుల ఆర్తనాదాలు!
కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం, దట్టమైన పొగ వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేయడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేసింది.

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం, దట్టమైన పొగ వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేయడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ శివారులోని రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
ప్రయాణికులు, స్థానికుల కథనం మేరకు.. కరీంనగర్ టు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు ఉదయం కరీంనగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. కాగా దాదాపు మూడు కిలోమీటర్ల మేర ప్రయాణం పూర్తి కాగా అలుగునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు రాగానే బస్సులో ఆకస్మాత్తుగా మంటలు, దట్టమైన పొగ రావడంతో బస్సులో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే డ్రైవర్ బస్సు ప్రధాన ద్వారం తెరవడం తో వెంటనే ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మంటలు క్షణాల్లో వ్యాపించడంతో డ్రైవర్, కండక్టర్ లు ఉన్నతాధికారులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే బస్సులో ఆకస్మాత్తుగా మంటలు ఎలా వ్యాపించాయో తెలియాల్సి ఉంది.






