సూర్యాపేట లో సినిమా సందడి.. ఆ కళాశాలలో 'నరనరమున పాట' ఆవిష్కరణ

by Disha Web Desk 12 |
సూర్యాపేట లో సినిమా సందడి.. ఆ కళాశాలలో నరనరమున పాట ఆవిష్కరణ
X

దిశ, సూర్యాపేట: తాను పుట్టి నడయాడిన గడ్డమీద తన మొదటి చిత్రం పాటను ఆవిష్కరించి సందడి చేశారు ఆ హీరో. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మూడో వార్డు బీబీ గూడెం కు చెందిన గౌతమ్ కృష్ణ తాను నటిస్తున్న ''ఆకాశ వీధుల్లో'' సినిమా నరనరమున పాటను హీరోయిన్ పూజిత పొన్నా తో కలిసి శనివారం సాయంత్రం స్థానిక ఎస్సై ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల నడుమ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో గౌతమ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు చిన్న సినిమాలను ఆదరించాలని తన మొదటి చిత్రానికి అన్నీ తానై అద్భుతంగా తీర్చి దిద్దుతున్నానన్నారు.

త్వరలోనే మీ ముందుకు మంచి కథతో తీస్తున్న మా సినిమాను తీసుకొస్తామన్నారు. అభిమానులు చిన్న చిత్రాలని కొట్టి పారేయకుండా తన చిత్రాన్ని ఆదరించాలి కోరారు. నాకు ఈ చిత్రం భవిష్యత్తు అని.. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉందన్నారు. అభిమానులను పాటలు విన్నారా ఎలా ఉన్నాయి అని అడుగగా బాగున్నాయి అంటూ.. అభిమానులు ప్రశంసలు కురిపించారు. అనంతరం అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగి సందడి చేసి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు సిబ్బంది, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed