- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిరోడ్డు మీద కారు ఆపిన బడా సినీ నిర్మాత.. ఏమైందంటే?
by Gantepaka Srikanth |
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నగరాల్లో స్థిరపడిన వారంతా పండక్కి సొంతూర్లకు వెళ్తుండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌లు జామ్‌లు అవుతున్నాయి. అయితే.. ఓ పని నిమిత్తం ఇవాళ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు(Daggubati Suresh Babu) ఏపీకి వెళ్లారు. హైదరాబాద్ నుంచి 6:30 గంటలకు బయలుదేరితే విజయవాడకు వెళ్లే సరికి దాదాపు 6 గంటలకు పైగా సమయం పట్టింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలియజేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులను చూసి స్వయంగా ఆయనే కారు దిగి నందిగామ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇతర సమయాల్లో కాకపోయినా.. పండుగల సమయంలోనైనా ఆర్ అండ్ బీ శాఖ వీలైనంత వరకు రోడ్డు మరమ్మతులు చేస్తే బాగుంటుందని సురేష్ బాబు పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Next Story






