- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధర రూ.21 కోట్లు
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న సాకర్ వరల్డ్ కప్ గేమ్స్ ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ పోరును ప్రత్యక్షంగా చూడాలంటే సామాన్యులు తమ జీవితకాల సంపాదనను ధారబోయాల్సి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రీసేల్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ ధర ఏకంగా 2.3 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.21 కోట్లు పలకడం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎందుకంత ధర?
జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలో జరగనుండగా.. గత కొన్నేళ్లుగా అమెరికాలో ఫుట్‌బాల్‌కు పెరుగుతున్న ఆదరణ, గ్లోబల్ డిమాండ్ కారణంగా టికెట్లకు విపరీతమైన పోటీ ఏర్పడింది. ఫిఫా (FIFA) అధికారికంగా నిర్ణయించిన ధరలు సాధారణంగా లక్షల్లోనే ఉన్నప్పటికీ, టికెట్లను ముందుగా కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులు వాటిని మళ్లీ రీసేల్ చేస్తున్నపుడు ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నారు. ప్రస్తుతం లోయర్ డెక్‌లో గోల్ లైన్ వెనుక ఉండే ప్రైమరీ సీట్ల కోసం కొందరు ఏకంగా రూ.21 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.
ఫిఫా అధికారిక రీసేల్ మార్కెట్‌పైనే నాలుగు టికెట్లు ఈ భారీ ధరకు లిస్ట్ అవ్వడంపై ఫుట్‌బాల్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 90 నిమిషాల ఆటను చూడటానికి ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం అసాధ్యమని, ఇది కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన క్రీడగా మారిపోతోందని విమర్శలు వస్తున్నాయి. ఫిఫా అధికారిక ధరలపై నియంత్రణ ఉన్నప్పటికీ, రీసేల్ మార్కెట్‌లో జరుగుతున్న ఈ దందాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం విచారకరం.






