Today Weather Update: ఇవాళ వాతావరణం అప్డేట్...?

by Kodari Anjali |

చలికాలం ముగియక ముందే అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి.

Today Weather Update: ఇవాళ వాతావరణం అప్డేట్...?
X

దిశ, వెబ్‌డెస్క్: చలికాలం ముగియక ముందే అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. మామూలుగా మార్చిలో నమోదయ్యే టెంపరేచర్స్.. ఫిబ్రవరి రెండో వారంలోనే రికార్డు అవుతున్నాయి. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ను క్రాస్ అవుతుంది. సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా ఉందని తాజాగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. నిన్న, మొన్నటివరకు ఈవెనింగ్, తెల్లవారి జామున చలి చంపినప్పటికీ.. ప్రస్తుతం ఉక్కుపోతతో జనాలు విసిగిపోతున్నారు. మార్నింగ్ 9 దాటితే చాలా సూర్యుడు భగభగ మంచిపోతున్నాడు. కాగా వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story