ఘోర రోడ్డు ప్రమాదం.. కారు చెట్టును ఢీ కొట్టి ఐదుగురు మృతి

by Malleboina Mahesh |   (  Updated:2026-01-18 05:16:16  IST  )

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. కారు చెట్టును ఢీ కొట్టి ఐదుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన మహారాష్ట్రలోని పుణే-సోలాపూర్ జాతీయ రహదారిపై మోహోల్ సమీపంలోని దేవ్డీ పాటి వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు రాయగడ జిల్లా పన్వెల్ నుంచి సోలాపూర్ జిల్లాలోని అక్క్కల్‌కోట్‌కు దైవదర్శనం కోసం ఎర్టిగా కారులో వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, జ్యోతి జయదాస్ టక్లే అనే మహిళ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతులను పన్వెల్, ఖార్ఘర్ ప్రాంతాలకు చెందిన మాలా రవి సాళ్వే (40), అర్చన తుకారాం భండారే (47), విశాల్ నరేంద్ర భోసలే (41), అమర్ పాటిల్, ఆనంద్ మాలీలుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన మహిళ ప్రస్తుతం మోహోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.

Next Story