- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండగపూట తీవ్ర విషాదం.. ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడం తో ఇద్దరు యువకులు ప్రాణాలుకు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటనతో ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీ విషాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడం తో ఇద్దరు యువకులు ప్రాణాలుకు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటనతో ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీ విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన నలుగురు యువకులు కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి అత్యంత వేగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు కాగా, దోమల మధు (22) అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో కారులో ఉన్న మిగిలిన ముగ్గురిని స్థానికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోట మధు అనే మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ఇద్దరు యువకులు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారు, గాయపడిన వారు అందరూ ఒకే కాలనీకి చెందిన వారు కావడంతో వైఎస్ఆర్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. పండుగ సంబరాల్లో ఉండాల్సిన కుటుంబాలు తమ బిడ్డలను కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నాయి. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.






