ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు-కారు ఢీకొని నలుగురు మృతి

by Malleboina Mahesh |

వేగంగా వెళ్తున్న కారు, బస్సు ఒకదానినొకటి ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో శనివారం సంభవించింది.

ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు-కారు ఢీకొని నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న కారు, బస్సు ఒకదానినొకటి ఢీకొట్టడంతో భారీ ప్రమాదం (Huge road accident) చోటు చేసుకొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో శనివారం సంభవించింది. పంజాబ్ రోడ్‌వేస్ బస్సు, కారు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులు కారులో అమృత్‌సర్ వైపు వెళ్తుండగా, బస్సు హోషియార్‌పూర్ నుండి బయలుదేరిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఏఎస్ఐ (ASI) అనిల్ కుమార్ వివరాలు వెల్లడించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బాధితులందరూ ఘటనా స్థలంలోనే మరణించారని ఆయన తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story