- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
by Muthe.Rajitha |
రాష్ట్రంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. నిర్మల్ జిల్లా భైంసా బస్ డిపో సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. కారు, కంటైనర్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరంతా హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులంతా కుబీర్ మండలానికి చెందిన బాబన్న, భోజరామ్ పటేల్, రాజన్న, వికాస్ లుగా పోలీసులు గుర్తించారు. మృతులను భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Next Story






