- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు సజీవదహనం!
రాజ్‌కోట్-చోటిలా హైవేపై బస్సు మరియు ట్యాంకర్ ఢీకొని జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనం కాగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేటు బస్సు, ట్యాంకర్ ఢీకొనడంతో భారీ ప్రమాదం (Huge road accident) చోటు చేసుకొని నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ సంఘటన రాజ్‌కోట్-చోటిలా హైవేపై సాంగాణి గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత వెన్నులో వణుకు పుట్టించే భయంకరమైన ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్ నుండి రాజ్‌కోట్ వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు, ముందు వెళ్తున్న టార్ (డ్రమ్) ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లో అది అగ్నిగోళంలా మారిపోయింది. దురదృష్టవశాత్తు, మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో నలుగురు ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేక బస్సులోనే సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కూడా కష్టంగా మారింది.
ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి సుమారు 1:30 నుండి 2 గంటల మధ్యలో ట్యాంకర్ టైర్ పేలడం వల్ల అది నియంత్రణ తప్పింది, అదే సమయంలో వెనక నుంచి వచ్చిన బస్సు దానిని ఢీకొట్టింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గాయపడిన వారు రాజ్‌కోట్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






