- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. బస్సు - ట్రక్కు ఢీకొని నలుగురు మృతి
ఒడిశాలో బస్సు - ట్రక్కు ఢీకొని నలుగురు మృతి! 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు. గ్యాస్ కట్టర్లతో బస్సును కోసి బాధితులను రక్షించిన సిబ్బంది.

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో నేషనల్ హైవే 143 పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (serious road accident) చోటు చేసుకుంది. రెండు వాహనాలుకు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి చండీ పోష్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసాబిరా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రూర్కెలా నుండి జాజ్‌పూర్ జిల్లా మంగళపూర్‌కు సుమారు 30 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు, చండీపోష్ సమీపంలో నియంత్రణ కోల్పోయి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వేగంతోనే ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ట్రక్కు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంటలు చెలరేగకుండా మరియు బస్సులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ సర్వీస్ సిబ్బంది గ్యాస్ కట్టర్లను ఉపయోగించి బస్సు భాగాలను కోసి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన 20 మంది ప్రయాణికులను వెంటనే రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రికి, లాహునిపడ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగం, సాంకేతిక లోపం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తూ.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






