- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన ముగ్గురు మృతి
కర్ణాటక తుమకూరు జిల్లాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఘోర ప్రమాదం. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి.

దిశ, వెబ్ డెస్క్: ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని తుంకూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన వారిని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన గజేశ్వర్ (65), ఇందిరా (55), సౌమ్య (35)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






